రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు..!
పల్లవి, వెబ్ డెస్క్ : తన సినిమాలతో ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఎంతటి ఘన చరిత్రను సృష్టించాడో వరుస వివాదాలతో, సంచలన వ్యాఖ్యలతో అంతే పేరుగాంచిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఒకప్పుడు తన సినిమాలతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఖ్యాతినే ప్రపంచానికి చాటిన ఆర్జీవీ ఆతర్వాత వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యల అనంతరం దేశ వ్యాప్తంగా వీధి కుక్కల దాడుల ఘటనలపై తీవ్ర చర్క్ష్హ జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఆర్జీవీ తనదైన శైలీలో విరుచుకుపడుతూ కుక్కల ప్రేమికులను లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన వ్యంగ్యాస్త్రాలను సంధించారు. తన అధికారక ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ ” కుక్కలు మీ కుటుంబ సభ్యులతో సమానమ్ అయితే మీ ఇంట్లోని పెంపుడు కుక్కలనే ఎందుకు పెళ్లి చేసుకోకూడదు” అంటూ కుక్కల ప్రేమికులను ప్రశ్నించారు.అక్కడితో ఆగకుండా పేదలందరినీ మీ ఇళ్లల్లోకి తెచ్చుకుని వీధులను పూర్తిగా కుక్కలకే వదిలేయచ్చు కదా.. పాలకుల మౌనం కంటే వీధికుక్కల అరుపులే మేలని , అందుకే పాలకుల స్థానంలో వాటినే కూర్చోబెట్టాలని ఆయన వ్యంగ్యంగా స్పందించారు.
తన వ్యాఖ్యలకు మరింత వ్యంగ్యాన్ని జోడిస్తూ మీపిల్లలను వీధికుక్కల గుంపుతో ఆడుకోవడానికి పంపించి, ప్రకృతితో బంధం పెంచుకోమని చెప్పగలరా అని ప్రశ్నించారు. కుక్కలకు కూడా పిల్లలతో సమాన హక్కులు ఉన్నాయని భావిస్తే , వీధి కుక్కల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు, పిల్లల కోసం కొట్టాలు నిర్మించాలని ఆయన సూచించారు. మీ పిల్లలకు అనారోగ్యం వస్తే ఆసుపత్రులకు, డాక్టర్ల వద్దకు బదులు వెటర్నరీ వైద్యుల వద్దకు తీసుకెళ్లి మీ పిల్లలకు వైద్యం చేయించాలని సూచించారు.



