గ్రాండ్గా అంబానీ చిన్న కోడలు బర్త్ డే సెలబ్రేషన్స్
రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముకేష్ అంబానీ చిన్న కోడలు రాధికా మర్చంట్ బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. ముంబైలో ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్ కు అంబానీ కుటుంబసభ్యులతోపాటు సినీ, క్రీడా రంగానికి చెందిన వారు కూడా హాజరై సందడి చేశారు
రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముకేష్ అంబానీ చిన్న కోడలు రాధికా మర్చంట్ బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. ముంబైలో ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్ కు అంబానీ కుటుంబసభ్యులతోపాటు సినీ, క్రీడా రంగానికి చెందిన వారు కూడా హాజరై సందడి చేశారు. టీమిండియా మాజీ క్రికెటర్ ధోనీ, జాన్వీకపూర్, సుహానా ఖాన్, ఆర్యన్ ఖాన్, రణ్వీర్ సింగ్, అర్జున్ కపూర్, శిఖర్ పహారియాతోపాటు దర్శకుడు అట్లీ కూడా ఈ వేడుకల్లో పాల్గొని రాధికా మర్చంట్ కు శుభాకాంక్షలు తెలిపారు.
దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీతో రాధికా మర్చంట్ పెళ్లి ఈ ఏడాది జులైలో గ్రాండ్ గా జరిగింది. దాదాపు రూ.5000 కోట్ల ఖర్చుతో జరిగిన ఈ పెళ్లి వేడుకలో ప్రపంచదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.



