Bigg Boss 8 Telugu : తెలుగు బిగ్ బాస్ లో తమిళ్ పిల్ల.. మగవాళ్లతో కలిసి ఫుట్ బాల్
స్టార్ మాలో వచ్చే కృష్ణ ముకుంద మురారి సీరియల్ తో ఫుల్ పాపులర్ అయిన ప్రేరణ కంబం ..నాలుగో కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రేరణ.. తెలుగు అమ్మాయే.. తమిళ కుటుంబంలో జన్మించిన ఈమె తండ్రి పేరు పురుషోత్తమ్. ఆయన సాఫ్ట్వేర్ కంపెనీ (టీసీఎస్)లో ఉద్యోగి. తల్లి పేరు రూప ఒక కాలేజీ అడ్మినిస్ట్రేషన్ శాఖలో ఉద్యోగి. బీటెక్ పూర్తి చేసిన ప్రేరణ ఇండస్ర్టియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ (2018)లో గ్రాడ్యుయేట్ పట్టా అందుకుంది.
ఎప్పుడూ యాక్టర్ కావాలని అనుకోలేదు ప్రేరణ. చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే ఇష్టం. జిల్లా, రాష్ట్ర స్థాయి లాంగ్ జంప్, హై జంప్, 400 మీటర్లు, 800 మీటర్లు పరుగు ఆవిడ పోటీల్లో పాల్గొంది. మగవాళ్లతో కలిసి ఫుట్‌బాల్ కూడా ఆడినట్లుగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ప్రేరణకు ఇంతకుముందే బిగ్ బాస్ పాల్గొన్న అనుభవం ఉంది. కిచ్చా సుదీప్ హోస్ట్ చేసిన కన్నడ బిగ్ బాస్ సీజన్ 8లో ప్రేరణ పార్టిసిపేట్ చేసింది. గత ఏడాది నవంబర్ నెలలో ప్రేరణ కంబంకు శ్రీపాద దేశ్‌పాండేతో పెళ్లి జరిగింది.




