Kalki 2898 AD OTT: మరికొన్ని గంటల్లో OTTకి వస్తున్న కల్కి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ కల్కి 2898 ఏడీ. క్రియేటీవ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, దిశా పటాని లాంటి స్టార్స్ కీ రోల్స్ చేశారు. ఇండియన్ మైథాలజీ అండ్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 27న విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
సరికొత్త కథ, కథనాలతో హాలీవుడ్ రేంజ్ వీఎఫెక్స్ తో వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. దాదాపు రూ.650 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ.1100 వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించి ప్రభాస్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే.. కల్కి సినిమా విడుదలై రెండు నెలలు గడుస్తున్న నేపధ్యంలో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు ఫిక్స్ అయ్యారు మేకర్స్. ఈ విషయంపై ఇటీవలే అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు.
ఆగస్టు 22 నుండి ప్రముఖ ఓటీటీ సంస్థలు అమెజాన్ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అంటే.. మరికొన్ని గంటల్లో కల్కి సినిమా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ మొదలుకానుంది. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.