పెళ్లి గురించి అనుష్క క్లారిటీ..!

పల్లవి, వెబ్ డెస్క్ : అనుష్క శెట్టి ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు, సినీ అభిమాని ఉండంటే అతిశయోక్తి కాదేమో. దాదాపు రెండు దశాబ్ధాల తన సినీ కెరీర్ లో సూపర్ మూవీతో ఎంట్రీచ్చిన స్వీటీ ఓ జేజేమ్మగా, ఓ దేవసేనగా, జీరో సైజు సినిమాతో తనకే సాధ్యమైన పాత్రలో నటించి దక్షిణాది సినిమా పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నారు. సూపర్ మూవీలో స్టార్ హీరో అక్కినేని నాగార్జున సరసన నటించిన స్వీటీ యువ సీనియర్ తేడా లేకుండా హీరోలందరితోనూ ఈ ముద్దుగుమ్మ ఆడిపాడింది. బాహుబాలి మూవీలోని దేవసేన పాత్రతో పాన్ ఇండియా హీరోయిన్ స్థాయికి ఎదిగింది. క్లాస్ మాస్ అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను తన నటనతో, అందంతో ఆకట్టుకుని మెప్పించిన బ్యూటీ స్వీటీ అనుష్క.
బాహుబలి మూవీ సమయంలో హీరోయిన్ అనుష్క శెట్టి హీరో ప్రభాస్ తో డేటింగ్ లో ఉన్నారు. వారిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారు అని నిన్న మొన్నటిదాక వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా తన పెళ్లి గురించి హీరోయిన్ అనుష్క క్లారిటీచ్చింది. ఓ ఇంటర్వూలో ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ ‘ తాను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను. ప్రేమ లేకుండా పెళ్లి చేసుకునే ఉద్ధేశ్యం నాకు లేదు. బాహుబలి మూవీ తర్వాత నాపెళ్లి గురించి ఒత్తిడి పెరిగిందనే వార్తలు వాస్తవమే . కుటుంబ సభ్యులే కాదు మీడియా నుంచి కూడా తరచూ ఇదే ప్రశ్న తలెత్తేది.
నాకు పెళ్లిపై పూర్తిగా నమ్మకం ఉంది. సరైన వ్యక్తి సరైన సమయంలో నాకు తారసపడినప్పుడు ప్రేమించి అతన్నే పెళ్లి చేసుకుంటాను. అయితే ఆ వ్యక్తి మాత్రం ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాదని స్వీటీ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వీటీ చేసిన తాజా వ్యాఖ్యలతో ప్రభాస్ తో పెళ్లి అనేది వట్టి పుకార్లే అని క్లారిటీ వచ్చినట్లయింది. అంతేకాదు అనుష్క పెళ్లాడేవాడు ఇండస్ట్రీతో సంబంధం లేనివాడు క్లారిటీగా చెప్పినట్లయింది అని సినీ క్రిటిక్స్ చెబుతున్నారు. చూడాలి మరి ముద్దుగుమ్మ పెళ్లి గురించి వస్తున్న పుకార్ల గురించి క్లారిటీ కోసం ఇండస్ట్రీతో సంబంధం లేని వ్యక్తిని పెళ్లాడ్తాను అని చెప్పారా..?. లేదా తన మనసులోని మాటను బయట పెట్టారా..?. అనేది కాలమే సమాధానం చెప్పాలి. మరోవైపు ప్రస్తుతం అనుష్క శెట్టి ఘాటీ సినిమాలో నటిస్తుంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.