సరికొత్త పాత్రలో ప్రభాస్ ..!

పల్లవి, వెబ్ డెస్క్ : సినిమాలోని తమ పాత్రకోసం హీరోలు స్పెషల్ కేర్ తీసుకోవడం గమినిస్తూనే ఉంటాం. లుక్ తో పాటు గెటప్, ఫిట్ నెస్ విషయాల్లోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. తాజాగా యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సైతం నెక్ట్స్ ప్రాజెక్టు కోసం సరికొత్తగా మేకోవర్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాడు.
ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ తో పాటు మాను రాఘవపూడి రూపొందిస్తున్న చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు ప్రభాస్. వీటి తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న స్పిరిట్ మూవీ సెట్ లో ప్రభాస్ అడుగు పెట్టనున్నాడు. సెప్టెంబర్ నెల నుంచి ప్రారంభం కానున్న ఈ సినిమాలో ప్రభాస్ మోస్ట్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కన్పించనున్నాడు.
ఇందుకుగానూ ప్రభాస్ కొత్త లుక్, ఫిజిక్ తో కన్పించనున్నాడు . దీనికోసం మరింత ఫిట్ గా రెడీ అవుతున్నాడు ప్రభాస్. గంటల కొద్ది జిమ్ లో కసరత్తులు చేస్తున్నారు. హైఓల్టేజీ యాక్షన్ ఎంటర్ ట్రైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కన్పించనున్నారని టాక్.