అయ్యో…! సమంత కు ఏమైంది.. మరి అంత సన్నగా ఉంది..!
పల్లవి, వెబ్ డెస్క్ : సమంత ఇప్పుడు ఈ పేరు ఎక్కడ విన్నా, చూసిన సంచలనంగా మారుతుంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత ఈ ముద్దుగుమ్మ ఏమి చేసిన కానీ సంచలనంగా మారుతుంది. ముఖ్యంగా సమంత అభిమానులు మాత్రం తమ అభిమాన నటి ఎక్కడ ఉన్నారు.. ఏమి చేస్తున్నారు .. ఎవరితో డేట్ లో ఉన్నారు.. ఏ సినిమా చేస్తున్నారు అని తెగ ఆరా తీస్తున్నారు.
తాజాగా సమంత గురించి బయటకు వచ్చిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతుంది. ముంబైలోని ఓ జిమ్ నుండి బయటకు వస్తున్న సమంతను అక్కడున్న కెమెరామ్యాన్లు, జర్నలిస్టులు ఫోటోలు, వీడియోలు తీశారు. ఆ క్రమంలో సమంత వారిని ఫోటోలు, వీడియోలు తీయద్దంటూ వారిస్తూ స్టాఫ్ ఇట్ గాయ్స్ అంటూ తీవ్ర అసహానాన్ని వ్యక్తం చేశారు.
ఆ వీడియోలో సమంత చాలా సన్నగా.. బక్కగా తయారవ్వడంపై అభిమానులు ఏమైంది అంటూ ఆరా తీస్తున్నారు. గతంలో ఈ ముద్దుగుమ్మ మయోసైటిస్ అనే కండరాల సమస్యతో బాధపడుతూ చికిత్స తీసుకున్నారు. కానీ తాజాగా సమ్ము ఇలా కన్పించడంతో ఫ్యాన్స్ భయాందోళనలో ఉన్నారు..?



