విడుదలకు ముందే ఓజీ సంచలనం.

పల్లవి, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా , ప్రియాంక మోహన్ హీరోయిన్ గా, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా ఈనెలలో విడుదల కానున్న మూవీ ఓజీ. సుజీత్ దర్శకత్వంలో మ్యూజిక్ సంచలనం ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి లు ఈ సినిమాను నిర్మిస్తున్నరు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇంకా విడుదల కాకముందే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నూతన చిత్రం ‘ఓజీ’ ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తూ, తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
ప్రీమియర్ ప్రీ-సేల్స్‌లో 1 మిలియన్ డాలర్లను రాబట్టి, ఈ సంచలనాత్మక ఘనతను అత్యంత వేగంగా సాధించిన చిత్రంగా నిలిచింది. పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. తన అసాధారణ క్రేజ్ తో ఎన్నో రికార్డులను ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ‘ఓజీ’ తుఫానుతో మరోసారి బాక్సాఫీస్ లెక్కలు సరి చేస్తున్నారు. అభిమానులతో పాటు, ట్రేడ్ వర్గాలు సైతం పవన్ కళ్యాణ్ సృష్టిస్తున్న సరికొత్త రికార్డుల పట్ల ఆసక్తిగా ఉన్నారు.ఓజాస్ గంభీర అనే శక్తివంతమైన పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
విడుదలకు మూడు వారాల ముందే.. ఓజీగా ఆయన బాక్సాఫీస్‌ను శాసిస్తున్నారు. ఆకలితో ఉన్న చిరుతపులిలా, పవన్ కళ్యాణ్ ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టుగా రికార్డులను వేటాడుతున్నారు. ఓజీ చిత్రం నుండి ఇప్పటిదాకా విడుదలైన ప్రతి పోస్టర్, ప్రతి గ్లింప్స్ సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించాయి. ‘ఓజీ’పై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ‘