అభిమానులకు ఎన్టీఆర్ బర్త్ డే కానుక..!
పల్లవి, వెబ్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే ఈనెల ఇరవై తారీఖున వేడుకలు ఘనంగా చేయడానికి సిద్ధమవుతోన్న అభిమానులకు శుభవార్త ఇది.
బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ , జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న తాజా చిత్రం ‘వార్-2’ . ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను ఈ నెల ఇరవై తారీఖున విడుదల చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు పద్నాలుగు తారీఖున ప్రేక్షకుల ముందుకు రానున్నది.



