ప్రశాంత్-ఎన్టీఆర్ మూవీ షూటింగ్ ఎప్పుడంటే?
దేవర సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినిది. ఇక అప్పటినుండి ఎన్టీఆర్ చేయబోయే నెక్స్ట్ సినిమాల గురించి ఆయన ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
దేవర సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినిది. ఇక అప్పటినుండి ఎన్టీఆర్ చేయబోయే నెక్స్ట్ సినిమాల గురించి ఆయన ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా మొదలైన విషయం తెలిసిందే. ఇక అప్పటినుండి ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ చూస్తున్నారు. తాజా సమాచారం మేరకు నవంబర్ లాస్ట్ వీక్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో పూర్తికావచ్చాయి. ఈలోగా వార్ 2 షూటింగ్ కంప్లీట్ చేయనున్న ఎన్టీఆర్ అనంతరం ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. ఇక షూటింగ్ కూడా త్వరగా కంప్లీట్ చేసి 2026 జనవరి 9న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చేస్తున్నారట మేకర్స్. మరి విడుదలకు ముందే ఈ రేంజ్ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా విడుదల తరువాత ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.



