దెబ్బ మీద దెబ్బ.. జానీమాస్టర్‌కు దిమ్మతిరిగే షాక్
అత్యాచారం కేసులో అరెస్టై, బెయిల్‌పై బయటికొచ్చిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు ఊహించని బిగ్ షాక్ తగిలింది. ఆయనకు ప్రకటించిన నేషనల్ అవార్డును రద్దు చేశారు.
అత్యాచారం కేసులో అరెస్టై, బెయిల్‌పై బయటికొచ్చిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు ఊహించని బిగ్ షాక్ తగిలింది. ఆయనకు ప్రకటించిన నేషనల్ అవార్డును రద్దు చేశారు. పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా అవార్డుకు ఎంపికైన కొద్దిరోజులకే ఆయనపై అత్యాచార ఆరోపణలు రావడంతో అరెస్టయ్యారు. ధనుష్ హీరోగా నటించిన తిరుచిట్రంబలం తమిళ సినిమాకు గానూ జానీ మాస్టర్‌కు ఉత్తమ కొరియోగ్రాఫర్ గా జాతీయ అవార్డును ప్రకటించారు.
అక్టోబర్ 8న న్యూఢిల్లీలో జరిగే ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో జానీ మాస్టర్ అవార్డును అందుకోవలసి ఉంది. ఈ వేడుకకు హాజరయ్యేందుకు జానీకి కోర్టు ఇటీవల మధ్యంతర బెయిల్ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. అక్టోబర్ 6 నుంచి 10 వరకు బెయిల్ మంజూరు చేసింది. కాగా, రేపిస్టుకు నేషనల్ అవార్డు ఇవ్వొద్దంటూ పలువురు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో అవార్డును రద్దు చేస్తూ అవార్డు కమిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో అతని బెయిల్ పై అనిశ్చితి ఏర్పడింది.



