Murari Re Release: ఇది మహేష్ రేంజ్.. రీ-రిలీజ్లో మురారి ఆల్ టైం రికార్డ్
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) మరో కొత్త రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. రికార్డ్ క్రియేట్ చేయాలన్నా నేనే, వాటిని తిరగరాయాలన్నా నేనే అనే మాటను మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. దాంతో.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఇది మహేష్ బాబు రేంజ్ అంటే అంటూ కాలర్ ఎగరేస్తున్నారు.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఆగస్టు 9 మహేష్ బాబు పుట్టినరోజు సంధర్బంగా ఆయన హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ మురారి సినిమాను రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఆడియన్స్ నుండి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. టికెట్స్ రిలీజ్ చేసిన కొన్ని గంటల్లోనే మొత్తం అమ్ముడై పోవడం విశేషం. ఇక.. రిలీజ్ తరువాత కూడా ఆ ఊపును అలాగే కంటిన్యూ చేసింది ఈ మూవీ. కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వసూళ్లు చేసింది. విడుదలైన మొదటిరోజే దాదాపు రూ.3 కోట్ల వసూళ్లు సాధించి రీ రిలీజ్ లో అప్పటివరకు ఉన్న అన్ని రికార్డ్స్ ను బద్దలు కొట్టింది.
అప్పటివరకు రూ.2.5 కోట్లతో బిజినెస్ మెన్ పేరుమీద ఉన్న రికార్డ్ ను బద్దలు కొట్టి ఆల్ టైం రికార్డ్ క్రియెట్ చేసిన సినిమాగా నిలిచింది మురారి మూవీ. దీంతో.. మహేష్ బాబు ఫాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. రిలీజైనా.. రీ రిలీజైన మహేష్ బాబు తరువాతే ఎవరైనా.. మహేష్ అంటే పేరు కాదు బ్రాండ్.. అంటూ కాలర్ ఎగరేస్తున్నారు ఫ్యాన్స్.



