మెగా మాస్ కాంబో.. జాతర షురూ
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే దర్శకుడు వశిష్టతో విశ్వంభర సినిమా చేస్తున్న చిరు ఇటీవలే యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే దర్శకుడు వశిష్టతో విశ్వంభర సినిమా చేస్తున్న చిరు ఇటీవలే యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ ప్రాజెక్టుపై ఇటీవలే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. తాజా సమాచారం మేరకు మెగాస్టార్ మరో మాస్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చాడట.
ఆ దర్శకుడు మరెవరో కాదు బోయపాటి శ్రీను. నిజానికి చాలా కాలంగా ఈ కాంబో గురించి ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ మాస్ కాంబో సెట్ అయింది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ అల్లు అరవింద్ నిర్మించనున్నాడట. ఇక అఖండ 2 కంప్లీట్ అయిన వెంటనే ఈ సినిమాను పట్టాలెక్కించనున్నాడట బోయపాటి.



