మెగా అభిమానులకు బ్యాడ్ న్యూస్.!
పల్లవి, వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరజీవి కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు వశిష్ఠ మల్లిడి తెరకెక్కిస్తోన్న సోషియో ఫ్యాంటసీ మూవీ ‘విశ్వంభర’. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని మెగా అభిమానులు గత కొంతకాలం నుంచి ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ చిత్రం ఈ సంక్రాంతికే రావాల్సి ఉండగా ఆశతో ఎదురుచూసిన ఫ్యాన్స్ కు చుక్కెదురైంది.
ఈ సినిమా విడుదలపై ఇప్పటికి క్లారిటీ లేదు. ఇలాంటి తరుణంలో దర్శకుడు మీడియాతో మాట్లాడుతూ ‘ విశ్వంభర ‘ ఒక్క పాట మినహా షూటింగ్ అంతా పూర్తైంది. సినిమా ఒక విజువల్ వండర్ లా ఉంటుంది. దాని నాణ్యత విషయంలో అస్సలు రాజీపడడం లేదు. అందుకే సినిమా విడుదల ఆలస్యమవుతోంది.
ఈ పనులన్నీ ఓ కొలిక్కి వచ్చాకే విడుదల తేదీపై స్పష్టతనిస్తాం . సినిమాలో అత్యధికంగా 4676 VFX షాట్స్ ఉంటాయి. అవి ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే విధంగా ఉంటాయి. ప్రపంచస్థాయి క్వాలిటీని అందివ్వడానికి టాప్ VFX కంపెనీలు పనిచేస్తున్నాయి’ అని తెలిపారు.



