అఖండ -2 టీజర్ రికార్డు ..!

పల్లవి, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు, హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా, హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ అఖండ -2. వీరిద్ధరి కాంబినేషన్ లో వచ్చిన అఖండ ఎంతటి ఘన విజయం సాధించిందో తెల్సిందే.
తాజాగా దీనికి సీక్వెల్ గా వస్తోన్న అఖండ -2 కి సంబంధించి టీజర్ నిన్న సోమవారం విడుదలైంది. ఈ టీజర్ లో బాలయ్య బాబు లుక్, డైలాగ్స్, తమన్ మ్యూజిక్ అందర్ని ఆకట్టుకుంది. టీజర్ విడుదలైన ఇరవై నాలుగంటల్లోనే 22.33 మిలియన్స్ వ్యూస్ తో పాటు 531.5K లైక్స్ సాధించింది.
దీంతో తెలుగు సినిమా చరిత్రలో ఇంత వేగంగా వ్యూస్ & లైక్స్ సాధించిన ఐదో టీజర్ గా ఇది రికార్డును సొంతం చేసుకుంది. టాప్ -5 లో రాధేశ్యామ్ (42.67M), గేమ్ ఛేంజర్ (32.40M), సర్కారు వారి పాట (23.06M), పుష్పరాజ్ పరిచయ వీడియో (22.52M), అఖండ -2 (22.33M) లు ఉన్నాయి.