“లిటిల్ హార్ట్స్” ఘన విజయాన్ని సొంతం చేసుకుంది – హీరో విజయ్ దేవరకొండ

పల్లవి, వెబ్ డెస్క్ : మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన “లిటిల్ హార్ట్స్” సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను అద్భుతంగా ప్రమోట్ చేసి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ బన్నీ వాస్ తన బీవీ వర్క్స్, వంశీ నందిపాటి తన వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేట్రికల్ గా రిలీజ్ చేశారు. ఈరోజు స్టార్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా “లిటిల్ హార్ట్స్” సినిమా సెలబ్రేషన్ ఆఫ్ గ్లోరీ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు అల్లు అరవింద్, బండ్ల గణేష్ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగానటి అనిత చౌదరి మాట్లాడుతూ – “లిటిల్ హార్ట్స్” సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన మా మేకర్స్ అందరికీ థ్యాంక్స్. ఈ సినిమా సక్సెస్ రీసౌండ్ లా వినిపిస్తోది. ఇలాంటి విజయాన్ని గురించి నేను విని దాదాపు పదేళ్లవుతోంది. “లిటిల్ హార్ట్స్” సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. అన్నారు.