సూర్య ‘ కరుప్పు’ టీజర్ విడుదల
పల్లవి, వెబ్ డెస్క్: తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా ఆర్ జే బాలజీ దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కరుప్పు’. చెన్నై భామ త్రిష హీరోయిన్ గా నటిస్తున్న కరుప్పు మూవీలో ఇంద్రన్స్, నట్టి, సుప్రీత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రకాష్ బాబు, ఎస్ఆర్ బాబు నిర్మిస్తున్నారు.
బుధవారం జూలై ఇరవై మూడో తారీఖున సూర్య పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ కొబ్బరి కాయ కొట్టి కర్పూరం వెలిగిస్తే శాంతించే దేవుడు కాదు. మనసులో మొక్కుకుని మిరపకాయలు దంచితే రుద్రుడే దిగొచ్చే దేవుడు అనే డైలాగులతో మొదలవుతుంది.
‘నా పేరు సూర్య… నాకు ఇంకో పేరుంది’ అంటుంటే బ్యాక్ గ్రౌండ్ లో కాలభైరవ అంటూ పాట , ‘మేరా భాయ్… ఇది మన టైమ్’ అంటూ సూర్య చెప్పే డైలాగులు టీజర్ లో ఉన్నాయి. “మాస్ కమర్షియల్ ఎంటర్ ట్రైనర్ గా రూపొందుతోన్న చిత్రం అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా మెన్ గా జీకే విష్ణు పని చేస్తుండగా సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు..



