నక్క తోక తొక్కిన కాజల్ అగర్వాల్. !

పల్లవి, వెబ్ డెస్క్ : టాలీవుడ్ మోస్ట్ సీనియర్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కమ్ బ్యాక్ మూవీస్ సూపర్ డూపర్ హిట్ గా నిలుస్తోన్న సంగతి మనకు తెల్సిందే.
తాజాగా ఈ సీనియర్ మోస్ట్ హాట్ బ్యూటీ కాజల్ అగర్వాల్ బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ , నేచూరల్ స్టార్ హీరోయిన్ సాయిపల్లవి సీతారాములుగా నటిస్తోన్న ‘రామాయణ’ సినిమాలో నటిస్తోన్నట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి..
రావణుడి సతీమణి అయిన మండోదరి పాత్రలో ఆమె కన్పించనున్నట్లు టాక్. నితేశ్ తివారి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో కేజీఎఫ్ స్టార్ హీరో యశ్ రావణుడిగా నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్టు రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొదటి భాగాన్ని వచ్చే ఏడాది నవంబర్ నెలలో విడుదల చేసేందుకు చిత్రం యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.