ఎర్ర కండువాతో చంచల్‌గూడ జైలు నుంచి జానీ మాస్టర్
టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం చంచల్ గూడ జైలు నుంచి కొద్దీసేపటి క్రితమే ఆయన రిలీజ్ అయ్యారు. కారులో ఆయన వెళ్తూ అభిమానులకు అభివాదం చేశారు
టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం చంచల్ గూడ జైలు నుంచి కొద్దీసేపటి క్రితమే ఆయన రిలీజ్ అయ్యారు. ఎర్ర కండువా (పవన్ అభిమానులు ఎక్కువగా ఉపయోగించే కండువా) వేసుకోని కారులో ఆయన వెళ్తూ అభిమానులకు అభివాదం చేశారు. దీంతో తనని జనసేన పార్టీ సస్పెండ్ చేసిన తాను మాత్రం అదే పార్టీతోనే ఉంటాననే జానీ చెప్పకనే చెప్పినట్లుగా తెలుస్తోంది.
కాగా లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. గత రెండు వారాలుగా చంచల్‌గూడ జైల్లోఉన్న జానీ మాస్టర్ కు గురువారం తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం అధికారులు విడుదల చేశారు.
జానీ మాస్టర్ తనను లైంగిక వేధించాడంటూ ఓ మహిళా కొరియోగ్రాఫర్ నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి పిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు.. జానీ మాస్టర్‌పై పోక్సో చట్టం కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి ఆయన్ను గోవాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో జానీ మాస్టర్‌కు ప్రకటించిన నేషనల్ అవార్డును వెనక్కి తీసుకున్నారు. అటు జనసేన పార్టీ కూడా జానీ మాస్టర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.



