దేవరలో గుడ్డి అమ్మాయిగా నటించింది ఎవరంటే.. ఎన్టీఆర్‌తో డాన్స్ ఇరగదీసిందిగా
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం దేవర పార్ట్ 1 . సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం దేవర పార్ట్ 1 . సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను… యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌రామ్‌లు కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఇందులో ఎన్టీఆర్ కు జోడీగా జాన్వీ కపూర్ నటించగా.. సైఫ్ అలీఖాన్ , శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ తదితరులు కీలకపాత్ర పోషించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
అయితే ఈ సినిమా ద్వారా చాలామంది టాలెంటెడ్ యాక్టర్లు బయటకు వచ్చారు. అందులో ఒకరు ప్రిన్సీ గార్జి. ఈ సినిమాలో శ్రీకాంత్ చెల్లెలుగా నటించిన ఈ అమ్మడుకు మంచి పేరు వచ్చింది. కళ్లు లేని అమ్మాయి పాత్రలో నటించిన ప్రిన్సీ గార్జి పెళ్లి సీన్ లో ఎన్టీఆర్ పక్కన డాన్స్ చేసి అదరగొట్టింది. దీంతో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తమిళనాడుకు చెందిన ఈ నటి స్వయంగా మంచి డాన్సర్ . ప్రిన్సీ గార్జి తునివు, జిగర్తాండ 2, బాలి, తంగలాన్.. లాంటి సినిమాల్లో నటించింది. తెలుగులో మొదటిసారి దేవర సినిమాలో నటించింది. ఇక ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.




