ఆ సంగతి నాకు తెలియదు : మంగ్లీ

పల్లవి, వెబ్ డెస్క్ : హైదరాబాద్ శివారులోని ఈర్లపల్లి ఓ రిసార్టులో ప్రముఖ సింగర్ మంగ్లీ ఆలియాస్ సత్యవతి రాథోడ్ తన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్న సంగతి తెల్సిందే.
అయితే, ఆ రిసార్టులో జరిగిన వేడుకలకు ఎలాంటి అనుమతి లేదని స్థానిక పోలీసులు నిర్వహించిన దాడుల్లో విదేశీ మద్యం దొరికింది. గంజాయి తీసుకున్న వ్యక్తులు పట్టుబడ్డారు.
మంగ్లీతో పాటు తొమ్మిది మంది వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి అని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై మంగ్లీ స్పందిస్తూ ” లిక్కర్, సౌండ్ సిస్టమ్ కు అనుమతి తీసుకోవాలనే సంగతి నాకు తెలియదు.
అక్కడ లోకల్ లిక్కర్ తప్పా ఏ మత్తు పదార్ధాలు వాడలేదు ” అని తెలిపారు. మరోవైపు ఈ సంఘటనపై రాజేంద్రనగర్ డీసీపీ మాట్లాడుతూ ‘ పార్టీకి అనుమతి లేకపోవడంతో కేసు నమోదైంది.
మత్తు పదార్ధాలు లభించలేదు. లిక్కర్ ను సీజ్ చేశాము. గంజాయి పాజిటివ్ వచ్చిన వ్యక్తి వేరే దగ్గర దానిని తీసుకున్నట్లు ” సమాచారం ఉందని పేర్కొనడం విశేషం.