యోగా సందర్భంగా హీరో తేజ సజ్జ పిలుపు..!
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ మహానగరంలో ఎల్బీ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు ఈరోజు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ, హీరోలు సాయి థరమ్ తేజ్, తేజ సజ్జ, హీరోయిన్ మీనాక్షి చౌదరి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తేజ సజ్జ మాట్లాడుతూ ” మన దేశంలో ఎప్పటి నుంచో ఎన్నో గొప్ప కళలు, విద్యలు ఉన్నాయి. యోగా వంటి ఎంతో అద్బుతమైన విలువైన సంపదను మనమంతా గౌరవించాలి.
ప్రస్తుత రోజుల్లో ఉన్న బిజీ షెడ్యూల్స్ లో యోగా లాంటి కార్యక్రమాన్ని చేస్తే మనకు , మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనివల్ల మెంటల్ స్ట్రెస్ , నెగటివిటీ లేకుండా ఉంటది.. మనకు మనస్శాంతి, ఉత్సాహాం , ఆరోగ్యంగా ఉండాలంటే తీరికే లేని ఈరోజుల్లో యోగా, మెడిటేషన్ ఎంతో అవసరం. ఈ గొప్ప కార్యక్రమాన్ని ఏటా ఘనంగా నిర్వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ధన్యవాదాలు’ అని ఆయన వ్యాఖ్యానించారు



