మనకు చేతకాక రాజమౌళి మీద తోస్తున్నం.. ఎన్టీఆర్ సంచలన కామెంట్స్
దేవర మూవీ ప్రమోషన్స్ లో హీరో ఎన్టీఆర్ కీలక కామెంట్స్ చేశారు. రాజమౌళితో సినిమా చేశాక ఆ హీరో తరువాతి చిత్రం ప్లాప్ అవుతుందన్న సెంటిమెంట్ ఇండస్ట్రీపై గట్టిగా పడింది
దేవర మూవీ ప్రమోషన్స్ లో హీరో ఎన్టీఆర్ కీలక కామెంట్స్ చేశారు. రాజమౌళితో సినిమా చేశాక ఆ హీరో తరువాతి చిత్రం ప్లాప్ అవుతుందన్న సెంటిమెంట్ ఇండస్ట్రీపై గట్టిగా పడింది. అయితే ఇదే విషయంపై ఎన్టీఆర్ మాట్లాడుతూ మనం కరెక్ట్ గా సినిమాలు చేసుకోలేక.. రాజమౌళి హిట్ ఇచ్చాడు కాబట్టి ఈ సినిమా పోయిందని ఆయన మీద తోసేశామని అన్నాడు.
మనకు చేతకాక క్రియేట్ చేసుకున్న ఒక టాక్ ఇది అని ఎన్టీఆర్ అభిప్రాయపడ్డాడు. అది రియాలిటీలో లేకపోయినా దాన్ని మనం బ్రేక్ చేశాం అనేది బాగుంది అని తారక్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా రాజమౌళి ప్లాప్ సెంటిమెంట్ ను ఎన్టీఆర్ దేవర మూవీతో బ్రేక్ చేశాడని చెప్పాలి.
కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన దేవర మూవీ సెప్టెంబర్ 27న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్ కొట్టింది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై రూపొందిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు. ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ సినిమాకి కొనసాగింపుగా పార్ట్ 2 కూడా ఉంది.



