డ్రగ్స్ కేసులో హీరో అరెస్ట్..!
పల్లవి, వెబ్ డెస్క్ : డ్రగ్స్ కేసులో హీరో శ్రీరామ్ ( శ్రీకాంత్ )ను తమిళనాడులోని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలో అదుపులోకి తీసుకున్న శ్రీరామ్ నుంచి రక్తనమునాలను తీసుకుని విచారిస్తున్నారు.
అయితే శ్రీరామ్ డీఎంకే నేత నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. మరోవైపు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వారు ఇచ్చిన సమాచారం మేరకే హీరో శ్రీరామ్ ను అదుపులోకి తీసుకున్నారు. నటుడుగా శ్రీరామ్ ఒకరికి ఒకరు, స్నేహితుడు, ఆడవారి మాటలకు ఆర్ధాలే వేరులే తదితర సినిమాలతో తెలుగు సినీ ప్రేక్షకులకు చేరువయ్యారు.



