అక్కినేని అభిమానులకు శుభవార్త

పల్లవి, వెబ్ డెస్క్ : యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య , దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా రానుందా..?. తండేల్ హిట్ తర్వాత ఓ మంచి సూపర్ డూపర్ హిట్ చిత్రం కావాలని హీరో నాగచైతన్య ఎదురుచూస్తున్నారా..?. అంటే అవుననే వార్తలు టీ టౌన్ లో వినిపిస్తున్నాయి. ఇటీవల తండేల్ మూవీ హిట్ సాధించిన ఆనందంలో ఉన్న హీరో నాగచైతన్యకు బోయపాటి శ్రీను ఓ కథను విన్పించారు.
ఆ కథ మాస్ , కమర్షీయల్ సంబంధించింది. బోయపాటి చెప్పిన కథ, తీరు తనకు నచ్చిందని, అన్నీ కుదిరితే ఈ ఏడాదినే సెట్ పైకి రానున్నదని వార్తలు కూడా ఫిల్మ్ నగర్ లో గుప్పుమంటున్నాయి. అంతే కాదు తనకు మజిలీ వంటి సూపర్ హిట్ మూవీని అందించిన శివ నిర్వాణ చెప్పిన కథ కూడా విన్నారు. అది కూడా తనకు నచ్చింది. ఈ ఇద్దరి దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
త్వరలోనే వీరిద్దరిలో ఒకరితో ముందు ఓ సినిమా మొదలు కానుంది. ఆ తర్వాత ఇంకొ దర్శకుడితో ప్రారంభం కానుంది అని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. ఈవార్తలు ఇలా ఉంటే ప్రస్తుతం నాగచైతన్య విరూపాక్ష ఫేమ్ దర్శకుడు కార్తీక్ వర్మ దండుతో వృష, కర్మ (వర్కింగ్ టైటిల్) తో ఓ మూవీ చేస్తున్నారు. ఇది నాగ చైతన్య కెరీర్ లోనే ఇరవై నాలుగో సినిమా. దీంతో 25వ సినిమా దర్శకుడు బోయపాటి శ్రీనా, లేదా శివ నిర్వాణ అనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.