Shilpa Rao: దేవరలో ‘చుట్టమల్లే’ పాట పాడిన శిల్పారావు ఎవరో తెలుసా?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ దేవర. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికితోడు.. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ఎన్టీఆర్ లుక్స్, టీజర్, ఫియర్ సాంగ్ ఆ అంచనాలను మరింత పెంచేశాయి.
ఇక ఆ హైప్ లో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి చుట్టమల్లే సాంగ్ రూపంలో మరో ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్. రొమాంటిక్ మెలోడిగా వచ్చిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాను షాక్ చేస్తోంది. పాటలో ఎన్టీఆర్ లుక్స్, జాన్వీ గ్లామర్ అదిరిపోవడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇక ఈ అద్భుతమైన పాటను అంతే అద్భుతంగా ఆలపించిన సింగర్ శిల్పరావు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఆమె గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
సింగర్ శిల్పారావు అచ్చమైన మన తెలుగుమ్మాయి. ఆమె 1984లో జన్మించారు. ఆమె తండ్రి వెంకట్రావు. ఆయన ఉద్యోగ రీత్యా కుటుంబం అంతా జార్ఖాండ్ లోని జంషెడ్ పూర్లో సెటిల్ అయ్యారు. అయితే.. తండ్రి వెంకట్రావుకి ముందునుండి మ్యూజిక్ పైన ఇంట్రెస్ట్ ఉండేది. అందుకే ఆయన మ్యూజిక్ లో డిగ్రీ చేశారు. దాంతో.. తండ్రిబాటలోనే ఆమె కూడా మ్యూజిక్ నేర్చుకున్నారు. శిల్పారావు తెలుగమ్మాయి అయినప్పటికీ.. ముందుగా బాలీవుడ్ లో పాపులర్ అయ్యారు. షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన వార్ సినిమాలో గుంగూ పాటతో ఒక్కసారిగా ఫెమస్ అయ్యారు ఆమె.
ఆ తరువాత వరుసగా పఠాన్ లో బేషరం రంగ్, జైలర్ సినిమాలో కావాలయ్యా వంటి పాటలు పాడి యూట్యూబ్ ను షేక్ చేశారు శిల్పారావు. కావాలయ్యా పాట గురించి ఎంత చెప్పినా తక్కువే. సోషల్ మీడియాలో, రీల్స్ లో, షార్ట్స్ లో ఎక్కడ చూసినా ఆ పాటె కనిపించేది, వినిపించేది. ఇక మహేష్ బాబు హీరోగా వచ్చిన గుంటూరు కారం సినిమాలో ‘ఓ మైబేబీ’ పాటను కూడా శిల్పరావు పాడారు. ఇప్పుడు లేటెస్ట్ గా దేవర సినిమాలో తన మ్యాజికల్ గొంతుతో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తున్నారు శిల్పరావు. చుట్టమల్లే అంటూ సాగిన ఈ పాట కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మరి ముందుముందు కూడా ఆమె మరిన్ని పాటలు పాడి మనల్ని ఇలాగే అలరించాలని కోరుకుందాం.



