అనుష్క ఫస్ట్ లవ్ ఎవరో తెలుసా..?
పల్లవి, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ఎప్పుడు ఏదోక వార్త వైరల్ అవుతుంది. తాజాగా ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ కు ఇంటర్వూలో మాట్లాడుతూ ‘ తన మొట్టమొదటి లవ్ గురించి రివైల్ చేశారు.
తాను ఆరో తరగతిలోనే సహచర విద్యార్థితో ప్రేమలో పడిపోయినట్లు ‘ ఆమె తెలిపారు. తన ఫస్ట్ లవ్ విషయాన్ని వివరిస్తూ ‘ఓ రోజు నా క్లాస్మెట్ నాదగ్గరికి వచ్చి ఐ లవ్యూ చెప్పాడు. నేను కూడా అతడికి ఒకే చెప్పా. అప్పుడు ఐ లవ్ యూ అంటే ఏంటో కూడా తెలియదు. ఆ విషయం ఇప్పటికీ నాకు ఓ మధురానుభూతి అంటూ చెప్పుకొచ్చారు. కాగా ప్రస్తుతం అనుష్క శెట్టి నటించిన ఘాటీ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.



