Indian 2: ఇండియన్ 2 క్లైమాక్స్‌లో బిగ్ సర్ప్రైజ్.. ఆడియన్స్ మైండ్‌బ్లాక్ అవడం ఖాయం!

Pallavi Cinema: లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ భారతీయుడు 2. 1996లో వచ్చిన బ్లాక్ బస్టర్ భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నాడు. సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, ఎస్ జే సూర్య, బాబీ సింహా ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ సినిమా జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో.. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే ట్రైలర్ కూడా ఉండటంతో ఆ అంచనాలు మరింత పెరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే.. విడుదలకు ముందే భారతీయుడు 2 సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ సినిమా క్లైమాక్స్ లో ఆడియన్స్ కు బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాడట దర్శకుడు శంకర్. అదేంటంటే.. భారతీయుడు 2 సినిమాకు సీక్వెల్ గా భారతీయుడు 3 వస్తున్న విషయం తెలిసిందే. మరో ఆరునెలల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఆ సినిమాకు ఇప్పటి నుండే ప్రమోషన్స్ మొదలుపెట్టాలని ఫిక్స్ అయ్యాడట శంకర్.
అందుకే.. భారతీయుడు 2 క్లైమాక్స్ లో భారతీయుడు 3కి సంబంధించిన ట్రైలర్ ను యాడ్ చేయనున్నాడట. ఆ ట్రైలర్ లో ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యే సర్ప్రైజ్ ఎలిమెంట్ ను రివీల్ చేయబోతున్నాడట. అది భారతీయుడు 3పై భారీ హైప్ ను క్రియేట్ చేయనుందట. ఆ ఎలిమెంట్ ఏమిటో తెలియదు కానీ, ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో.. శంకర్ చూపించబోతున్న ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ఆసక్తిచూపిస్తున్నారు ఆడియన్స్. మరి అంత పెద్ద సర్ప్రైజ్ ఏంటో అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.
Related News
-
సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర కీలకం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
భారీ ధర పలికిన బాలాపూర్ లడ్డూ
-
మహిళల ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి- ఎంపీ కావ్య
-
సామాజిక కార్యక్రమాలకే ఎక్కువ సమయం కేటాయిస్తా -ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
-
వచ్చే సీజన్ కోసం కూలైన్లల్లో రైతులు -ఎంపీ రఘువీరారెడ్డి
-
శిల్పాశెట్టి దంపతులపై కేసు నమోదు