దేవరలో ఒక్క సీన్తో ఫుల్ క్రేజ్.. ఎవరీ చంద్రకళ?
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం దేవర. పార్ట్ 1 సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ తో దూసుకుపోతుంది.
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం దేవర. పార్ట్ 1 సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ తో దూసుకుపోతుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ సినిమాకి కొనసాగింపుగా పార్ట్ 2 కూడా ఉంది. అయితే ఈ సినిమాలో ఈ సినిమాలో చంద్రకళ పాత్రలో నటించిన ఓ అమ్మాయికు ఇప్పుడు ఫుల్ క్రేజ్ వచ్చేసింది. అమె పేరు లత విశ్వానాథ్ రెడ్డి.

ఈ చిత్రంలో ఆమె రత్నగిరి గ్రామానికి చెందిన వేశ్య పాత్రలో నటించి మెప్పించింది. మళ్ళీ వచ్చే నేల వస్తానంటూ ఆమె కళ్లతో పలికించిన హావాభావాలకు కుర్రకారంతా ఫిదా అయిపోయారు. విలన్ తో మాట్లాడుతూ సముద్రం మీదకి వెళుతున్నవంటగా.. దేవర ఏమైన చేస్తే మళ్లీ నన్ను కలిసే అవకాశం ఉందో లేదంటూ ఆమె చెప్పిన డైలాగ్స్ కు ప్రేక్షకుల నుండి విజిల్స్ పడ్డాయి. సినిమాలో చిన్న రోల్ అయిన ఆమె మంచి గుర్తింపు అయితే వచ్చింది.

దేవరలో చిన్న రోల్ వచ్చిన చాలు అనుకున్నానని.. కానీ మంచి గుర్తింపున్న పాత్రే దక్కిందని లత విశ్వానాథ్ రెడ్డి చెబుతున్నారు. డైరెక్షన్ డిపార్ట్ మెంట్ ద్వారా దేవర సినిమాలో అవకాశం వచ్చిందని తెలిపారు. ఈ సినిమా కోసం కొత్త సినిమాలు చాలా వదులుకున్నానని చెప్పారు. ఈ సినిమాకు తాను అనుకున్నదానికంటే ఎక్కువే రెమ్యూనరేషన్ ఇచ్చారని తెలిపింది. కానీ ఎన్టీఆర్ ను కలవకపోవడమే నిరాశగా అనిపించదన్నారు.

ప్రభాస్ సలార్ సినిమాలో అవకాశం వచ్చిందని కానీ ఎక్కువ సేపు కనిపించలేదని తెలిపారు. కుప్పం ప్రాంతానికి చెందిన లత బీఎస్సీ చేశారు. రియల్ ఎస్టేట్ రంగంలో కొన్ని రోజులు పనిచేసిన లత.. కిరణ్ అబ్బవరంతో మీటర్, రూల్స్ రంజన్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించారు. దాదాపుగా తమిళ్, కన్నడ, తెలుగులో 50పైగా సినిమాలు చేశారు. ఈమెకు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఉంది.



