Sreeleela Remuneration : తెలివిగల శ్రీలీల.. మూడు నిమిషాల పాటకు డబుల్ రెమ్యూనరేషన్!
Sreeleela Remuneration : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా తెరకెక్కుతోన్న ‘పుష్ప-2’ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో స్పెషల్ సాంగ్ లో ‘కిస్సిక్’లో శ్రీలీల కనిపించనున్నట్లు పేర్కొంది.
Sreeleela Remuneration : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా తెరకెక్కుతోన్న ‘పుష్ప-2’ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో స్పెషల్ సాంగ్ లో ‘కిస్సిక్’లో శ్రీలీల కనిపించనున్నట్లు పేర్కొంది. ఆమెకు స్వాగతం చెబుతూ ట్వీట్ చేసింది. వాస్తవానికి ఈ సినిమాలో శ్రీలీల నటించనున్నట్లుగా ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. తాజాగా మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేసి అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు.
Team #Pushpa2TheRule welcomes The Dancing Queen @sreeleela14 on board for the #Kissik Song of the Year❤🔥
This song is going to be a dance feast and a musical delight 💥💥💥
GRAND RELEASE WORLDWIDE ON 5th DECEMBER, 2024.#Pushpa2TheRuleOnDec5th
Icon Star @alluarjun… pic.twitter.com/liaIZQCL3s
— Pushpa (@PushpaMovie) November 10, 2024
ఇక శ్రీలీల అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది డాన్సే. ధమాకా సినిమాలో మాస్ పాటలకు ఎనర్జిటిక్ స్టెప్పులతో అదరగొట్టేసింది ఈ భామ. దీంతో ఆమె డ్యాన్స్ కు చాలా మంది ప్యాన్స్ ఉన్నారు. అటు బన్నీ కూడా మంచి డాన్సర్. దీంతో ఈ ఇద్దరు కలిస్తే ఈ ఐటమ్ సాంగ్ రచ్చ రచ్చే అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఈ స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీల భారీగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం మార్కెట్ లో హీరోయిన్ గా శ్రీలీలకు ఉన్న డిమాండ్ రూ. 1.5కోట్లు . కానీ ఈ పాట కోసం ఆమె ఏకంగా రూ. 3 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారట. అంటే డబుల్ రెమ్యూనరేషన్ అన్నమాట. ఐటమ్ సాంగ్ కావడం, పైగా సక్సెస్ అయిన సినిమాకు సిక్వెల్ కావడంతో శ్రీలీల భారీగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది.
పార్ట్ 1లో సమంత కూడా ఐటమ్ సాంగ్ కోసం కోటికిపైగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఇప్పటికే విడుదలైన సాంగ్స్, పోస్టర్లు ఆకట్టుకున్నాయి. ఈ మూవీ డిసెంబర్ 5న రిలీజ్ కానుంది.



