Sandeep Raj : నటితో పెళ్లి పీటలెక్కనున్న కలర్ ఫొటో డైరెక్టర్
Sandeep Raj : టాలీవుడ్ లో మరో జంట పెళ్లి పీటలెక్కనుంది. కలర్ ఫొటో దర్శకుడు సందీప్ రాజ్ పెళ్లి పీటలు ఎక్కనున్నారు.
Sandeep Raj : టాలీవుడ్ లో మరో జంట పెళ్లి పీటలెక్కనుంది. కలర్ ఫొటో దర్శకుడు సందీప్ రాజ్ (Sandeep Raj) పెళ్లి పీటలు ఎక్కనున్నారు. నటి చాందినీ రావును ఆయన ప్రేమ వివాహం చేసుకోనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. నవంబర్ 11న వీరి ఎంగేజ్మెంట్ వైజాగ్ లో జరగనుందని తెలిపాయి.

డిసెంబర్ 7న తిరుపతిలో పెళ్లి చేసుకుంటారని వెల్లడించాయి. కాగా చాందినీ కలర్ ఫొటో, రణస్థలి వంటి చిత్రాలతో పాటు హేడ్స్ అండ్ టేల్స్ వెబ్ సిరీస్లో నటించారు. యూట్యూబ్ ఫిల్మ్స్ నుంచి సందీప్ రాజ్ ప్రయాణం మొదలైంది. అప్పట్లో చాందిని రావుతో ఆయనకు పరిచయం అయినట్టు తెలుస్తోంది.
Writer-director #SandeepRaj, who gained recognition with #ColourPhoto, is engaged to actor #ChandiniRao on November 11 in Visakhapatnam. The wedding will take place on December 7 in Tirupati. It’s a love marriage. pic.twitter.com/YncOlsZm5c
— Matters Of Movies (@MattersOfMovies) October 30, 2024



