‘లక్కీ భాస్కర్’ సీక్వెల్ పై క్లారిటీ..!

పల్లవి, వెబ్ డెస్క్ : దుల్కర్ సల్మాన్ హీరోగా , మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా పోయిన సంవత్సరం దీపావళి కానుకగా విడుదలైన మూవీ ‘ లక్కీ భాస్కర్’ .
వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా మరియు శ్రీకరా స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తూ భారీ విజయాన్ని అందుకున్నది.
తాజాగా ఈ సినిమా సీక్వెల్ గురించి దర్శకుడు వెంకీ అట్లూరి క్లారిటీచ్చారు. ‘ లక్కీ భాస్కర్’ మూవీకి తప్పకుండా సీక్వెల్ ఉంటుంది’ అని ఓ ఇంటర్వూలో పేర్కొన్నారు. అయితే స్క్రిప్ట్, చిత్రీకరణ గురించి మాత్రం ఆయన క్లారిటీవ్వలేదు.