సమంత డేటింగ్ వార్తలపై క్లారిటీ..!
పల్లవి, వెబ్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒకప్పటి స్టార్ హీరోయిన్.. పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన అందాల నటి సమంత . హీరోయిన్ సమంత బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో డేటింగ్ లో ఉన్నట్లు ఇటు సోషల్ మీడియా… అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి.
తాజాగా ఈవార్తలపై సమంత మేనేజర్ స్పందించారు. సమంత మేనేజర్ స్పందిస్తూ ‘ ఈ వార్తలన్నీంటిని ఖండించారు. ఈవార్తలన్నీ కేవలం టీఆర్ఫీ రేటింగ్ కోసమే తప్పా అందులో వాస్తవం లేదని’ అన్నారు.
అయితే, ఇటీవల రాజ్ నిడిమోరుతో సమంత అత్యంత సన్నిహితంగా ఉన్న ఓ ఫోటోను వైరల్ చేస్తూ వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు. కలిసి జీవించేందుకు ఓ ఇల్లు కూడా వెతుకుతున్నారని తెగ వార్తలను ప్రచారం చేశారు. సమంత మేనేజర్ క్లారిటీతో వీటికి ఫుల్ స్టాఫ్ పడినట్లే.



