జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. పుష్ప 2 నుంచి ఔట్
స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బిగ్ షాక్ తగిలింది. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న పుష్ప 2 సినిమాకు ఆయన కొరియోగ్రఫీ చేయడం లేదని నిర్మాతల్లో ఒకరైన నవీన్ వెల్లడించారు.
స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బిగ్ షాక్ తగిలింది. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న పుష్ప 2 సినిమాకు ఆయన కొరియోగ్రఫీ చేయడం లేదని నిర్మాతల్లో ఒకరైన నవీన్ వెల్లడించారు. జానీ మాస్టర్ స్థానంలో మరోకరిని తీసుకున్నట్లుగా తెలిపారు. అయితే ఈ సినిమాలో ఐటెం సాంగ్ కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. డిసెంబర్ 5న పుష్ప 2 విడుదల కాబోతుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ కొత్త పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్
కాగా కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోక్సో కేసులో అరెస్టయిన జానీ ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు. ఈ అరెస్టు నేపథ్యంలో ఆయనకు ప్రకటించిన నేషనల్ అవార్డు కూడా రద్దయిన విషయం తెలిసిందే. గత రెండు వారాలుగా చంచల్‌గూడ జైల్లో ఉన్న జానీ మాస్టర్ ఇవ్వాళ విడుదలయ్యే అవకాశం ఉంది.



