మళ్లీ ప్రగ్యా జైస్వాలా.. హీరోయిన్ను మార్చవయ్యా బోయపాటి!

ఇండస్ట్రీలో బాలకృష్ణ, బోయపాటిలది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. వీరి కాంబోలో వచ్చిన మూడు సినిమాలు ఇప్పటికే సూపర్ హిట్ కాగా తాజాగా అఖండ 2 మూవీ పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. అఖండ 2 అనే టైటిల్‌కి తాండవం అనే ట్యాగ్ లైన్ జోడించారు.
అఖండలో ఉన్న చిన్న పాప పెద్దగా అయిన తర్వాత ఏం జరిగిందనేది ఇందులో చూపించబోతున్నారు. ఈ ప్రారంభత్సవ వేడుకకు చిత్రబృందంతో పాటుగా బాలకృష్ణ కుమార్తెలు నారా బ్రాహ్మణి, తేజస్విని, ఇతర కుటుంబసభ్యులు, ప్రముఖ డైరెక్టర్లు హాజరయ్యారు. ముహూర్తపు షాట్‌కు నారా బ్రాహ్మణి క్లాప్ కొట్టారు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై తెరకెక్కబోతున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
అఖండలో బాలయ్యతో కలిసి నటించిన ప్రగ్యా జైస్వాల్ ను పార్ట్ 2లో కూడా హీరోయిన్ గా తీసుకున్నారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ కాస్త డిస్సాపాయింట్ అవుతున్నారు. అఖండలోనే ప్రగ్యా జైస్వాల్ ను చూడలేకపోయామని మళ్లీ ఆమెనే అంటే తట్టుకోలేకపోతున్నామని ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. హీరోయిన్ ను మార్చాలంటూ డైరెక్టర్ బోయపాటిని రిక్వెస్ట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం అఖండ చిత్రానికి పార్ట్ 2 కంటిన్యూ మూవీ కాబట్టి ప్రగ్యా జైస్వాల్ ను తీసుకుని ఉండోచ్చంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Related News
-
సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర కీలకం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
భారీ ధర పలికిన బాలాపూర్ లడ్డూ
-
మహిళల ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి- ఎంపీ కావ్య
-
సామాజిక కార్యక్రమాలకే ఎక్కువ సమయం కేటాయిస్తా -ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
-
వచ్చే సీజన్ కోసం కూలైన్లల్లో రైతులు -ఎంపీ రఘువీరారెడ్డి
-
శిల్పాశెట్టి దంపతులపై కేసు నమోదు