బిగ్‌బాస్ హోస్ట్‌గా నాగార్జునను తప్పించాలి.. తిరగబడ్డ మాజీ కంటెస్టెంట్
హీరో నాగార్జునను బిగ్‌బాస్ హోస్ట్‌గా తప్పించాలని ప్రముఖ హేతువాది బాబు గోగినేని డిమాండ్ చేశారు. అక్రమ కట్టడాలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ షో హోస్ట్‌ను బిగ్‌బాస్ నిర్వాహకులు తక్షణమే మార్చాలి. లేదంటే హౌస్ మేట్స్, టీవీ వీక్షకులు ఓట్లు వేసి మరీ ఆయన్ను ఎలిమినేట్ చేయాలంటూ ఫేస్ బుక్ లో ఆయన ఓ పోస్టు పెట్టారు. కాగా హైదరాబాద్‌లోని తుమ్మిడి చెరువును కబ్జా చేసి హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ను నిర్మించారంటూ హైడ్రా అధికారులు శనివారం కూల్చివేశారు.
ఈ క్రమంలో నాగార్జునను బిగ్‌బాస్ నుంచి తొలగించాలంటూ బాబు గోగినేని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. కాగా బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇక తెలుగులోల బిగ్ బాస్ సీజన్ 8 మరో వారం రోజుల్లో స్టార్ట్ కానుంది. కొత్త సీజన్‌కు నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించానున్నాడు. ఈ మధ్యే సీజన్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.
మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా ఆధికారులు కూల్చివేయడంపై నాగార్జున హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. కూల్చివేతలు ఆపాలంటూ ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు ఆపేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ తీర్పు వచ్చే లోపే హైడ్రా ఆధికారులు ఎన్ కన్వెన్షన్‌ను నెలమట్టం చేశారు.



