స్టార్ హీరో తమ్ముడితో అనుష్క..!
పల్లవి, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరోయిన్, అందాల రాక్షసి అనుష్క స్టార్ హీరో సూర్య తమ్ముడు స్టార్ హీరో కార్తి హీరోగా నటిస్తోన్న ఓ మూవీలో నటించనున్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు గుప్పుమంటున్నాయి.
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఖైదీ-2 గా ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో పాత్ర గురించి హీరోయిన్ స్వీంతో చర్చలు పూర్తయినట్లు వార్తలు వస్తోన్నాయి.
అయితే, త్వరలోనే దీనిపై అధికారక ప్రకటన వెలువడనున్నది. కాగా ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ తెలుగులో ‘ఘాటి , మలయాళంలో కథనార్ – ది – వైల్డ్ సోర్సెరర్ ‘ చిత్రాల్లో నటిస్తున్నారు.



