‘ఘాటీ’ ఫస్ట్ లుక్.. సరికొత్త అవతారంలో అనుష్క
సౌత్ బ్యూటీ అనుష్క చాలా కాలం తరువాత చేస్తున్న సినిమా "ఘాటీ". సెన్సిబుల్ చిత్రాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా అనుష్క ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్.
సౌత్ బ్యూటీ అనుష్క చాలా కాలం తరువాత చేస్తున్న సినిమా “ఘాటీ”. సెన్సిబుల్ చిత్రాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా అనుష్క ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. తల, చేతికి రక్తంతో చుట్ట తాగుతూ.. భయపెట్టేలా అనుష్క ఫస్ట్ లుక్ వైరల్ అవుతోంది. ఈ లుక్ చూసిన అనుష్క ఫ్యాన్స్, ఆడియన్స్ అవాక్కవుతున్నారు. ఇక మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తరువాత అనుష్క ఇప్పటివరకు సినిమా చేయలేదు. దాంతో ఘాటీ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ తో ఆ అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకుంటున్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి అరుంధతి, భాగమతి లాంటి సూపర్ హిట్ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తరువాత అనుష్క చేస్తున్న ఫుల్ లెన్త్ సినిమా ఆడియన్స్ ను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.



