బిగ్ షాక్.. హీరో అక్షయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్
అలర్ట్… కరోనా మళ్లీ వస్తుంది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కు కరోనా సోకింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అక్షయ్.. తాజాగా టెస్టు చేసుకోగా అందులో పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఒంటరిగా ఉంటున్న అక్షయ్ .. వైద్యులు సూచించిన విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తన టీమ్ సభ్యులు కూడా ఒకసారి కరోనా టెస్ట్ చేయించుకోవాలని అక్షయ్ సూచించాడు. అయితే అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహానికి అక్షయ్ కుమార్ వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే అక్కడికి వచ్చిన చాలా మందికి కరోనా సోకే ప్రమాదం లేకపోలేదు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. అక్షయ్ గతంలో రెండుసార్లు కరోనా బారిన పడ్డాడు. 2021లో ఓసారి, 2022లో మరోసారి కోవిడ్‌తో పోరాడి కోలుకున్నారు. ఇక ఇప్పటికే సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి దిగ్గజాలు పెళ్లిలో కనివిందు చేయడానికి రెడీ అయిపోయారు. బాలీవుడ్ తారాతోరణంతో పాటు టాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ పెళ్లికి హాజరు కాబోతున్నట్లు తెలుస్తుంది.



