sarada : ఇద్దరు భర్తల చేతిలో మోసపోయిన శారద!
sarada : టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో పెళ్లై, పిల్లలున్న వ్యక్తిని పెళ్లాడిన నటీమణులలో ముందుగా గుర్తొచ్చే పేర్లు సావిత్రి, శ్రీదేవి. అలాగే మరో సీనియర్ నటి శారద(sarada) కూడా అలాగే చేసింది.
sarada : టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో పెళ్లై, పిల్లలున్న వ్యక్తిని పెళ్లాడిన నటీమణులలో ముందుగా గుర్తొచ్చే పేర్లు సావిత్రి, శ్రీదేవి. అలాగే మరో సీనియర్ నటి శారద(sarada) కూడా అలాగే చేసింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్‌బాబు వంటి దిగ్గజాలతో పలు చిత్రాల్లో నటించిన శారదా .. 90వ దశకం నుండి తల్లి పాత్రలతో పాపులర్ అయింది.
అయితే శారద తన వ్యక్తిగత జీవితంలో రాంగ్ స్టెప్ వేసింది. నటిగా వెలుగొందుతున్న సమయంలో ఆమె చలంతో ప్రేమలో పడింది. చలంకి అప్పటికే పెళ్లై ముగ్గురు పిల్లలున్నారు. అతని భార్య అగ్ని ప్రమాదంలో మరణించింది. ఆ తరువాత శారద చలం ప్రేమలో పడింది. శారదా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. నేను ప్రేమలో ఉన్నప్పుడు చలం నన్ను బాగా చూసుకునేవాడు. ప్రేమ గుడ్డిది, నాకు అప్పుడు ఏమీ అర్థం కాలేదు. అప్పుడు నా వయసు కేవలం 22 సంవత్సరాలు అని తెలిపింది.
శారదా 1972లో చలంను పెళ్లాడింది. పెళ్లయిన మూడో రోజే చలం అసలు రంగు బయటపడింది. డబ్బు కోసమే తనని పెళ్లి చేసుకున్నాడని శారద చెప్పుకొచ్చింది. షూటింగ్ సెట్స్‌కి వచ్చి వేధించేవాడని.. ఒక్కోసారి కొట్టేందుకు కూడా ప్రయత్నించాడని శారద ఏడ్చింది. అతడి వేధింపులు భరించలేక విడిపోయానని శారద తెలిపింది.
పెళ్లి విషయంలో మరోసారి మోసపోయింది శారద. చలంతో విడిపోయిన తర్వాత ఆమె ఒక మలయాళీ వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. అతను కూడా కొన్ని రోజులు బాగానే ఉన్నాడు. ఆ తర్వాత అతనికి తన డబ్బుపైనే ఆశ ఉందని తెలుసుకుని శారద అతనితో కూడా విడిపోయింది. శారదకు పిల్లలు లేరు. ఆమె తన సోదరుల పిల్లలను పెంచుతూ చెన్నైలో నివసిస్తున్నారు.
1945 జూన్ 25న గుంటూరు జిల్లా, తెనాలిలో జన్మించిన శారద అసలు పేరు సరస్వతి. బాలనటిగా సినీ జీవితాన్ని ప్రారంభించిన శారద మూడు సార్లు ఊర్వశి అవార్డును అందుకొని ఊర్వశి శారదగా ప్రసిద్ధి చెందింది. శారద 1996లో 11వ లోక్‌సభకు తెనాలి నియోజవర్గము నుండి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైంది.



