65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ లవ్
పల్లవి, వెబ్ డెస్క్ : ప్రస్తుతానికి ఆ హీరోయికి ఓ డెబ్బై నాలుగు ఏండ్లు ఉంటాయి. ఇండస్ట్రీలో హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. మరోవైపు ఆ హీరోయిన్ కు ప్రస్తుతం ముప్పై ఐదేండ్లు ఉంటాయి. ప్రస్తుతం వీరిద్దరూ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నారు. అయితే ఈ స్టార్ హీరో నటించిన ఓ సినిమా థియేటర్లలో భారీ విజయాన్ని అందుకుంది. సదరు సినిమా విడుదలైన సమయంలో కంటెంట్, దర్శకత్వం, యాక్టింగ్ పై విమర్శకులు సైతం ప్రశంసుల వర్షం కురిపించారు.
కానీ ఈ మూవీ విడుదలైన సమయంలో నెట్టింట హీరోహీరోయిన్ ఏజ్ గ్యాప్ గురించి పెద్ద చర్చే నడిచింది. ఎందుకంటే ఈ సినిమాలో హీరోయిన్ వయసు కేవలం 29 సంవత్సరాలు మాత్రమే. ఇక హీరో వయసు ఆ సినిమా సమయానికి 65 ఏళ్లు. అంటే ఇద్దరి మధ్య 35 సంవత్సరాల వ్యత్యాసం ఉందన్నమాట. ఇంతకీ ఈ సినిమా ఏంటో తెలుసా.. ?. ఆ సినిమా మరెదో కాదండి.. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలి.
రూ.100 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్ తో సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. 2016లో విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. డైరెక్టర్ పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నిర్మాత కళైపులి ఎస్.థాను నిర్మించారు. కబాలి అనే పైబడిన గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించారు. ఇక ఈ సినిమాలో రజినీ భార్యగా రాధికా ఆఫ్టే కథానాయికగా నటించింది. అప్పుడు ఆమె వయసు కేవలం 29 సంవత్సరాలు మాత్రమే. ఈ సినిమా మొత్తం పదివేల స్క్రీన్ లలో విడుదలై అప్పట్లోనే రికార్డ్స్ సృష్టించింది.



