టాటా ట్రస్టు ఛైర్మన్ గా నోయల్ టాటా
రతన్ టాటా మరణంతో టాటా ట్రస్టు ఛైర్మన్ గా నోయల్ టాటా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు బోర్డు సభ్యులు ఓ ప్రకటన చేశారు. ఈయన రతను వరుసకు సోదరుడు అవుతారు
రతన్ టాటా మరణంతో టాటా ట్రస్టు ఛైర్మన్ గా నోయల్ టాటా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు బోర్డు సభ్యులు ఓ ప్రకటన చేశారు. ఈయన రతను వరుసకు సోదరుడు అవుతారు. సవతి తల్లి సిమోన్ టాటా కుమారుడు. ఆయన ఇప్పటికే టాటా గ్రూపులోని పలు కంపెనీల్లో వివిధ కీలక హోదాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ట్రెంట్, వోల్టాస్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, టాటా ఇంటర్నేషనల్ కంపెనీలకు ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టాటా స్టీల్, టైటాన్‌కు వైస్ ఛైర్మన్‌గానూ ఉన్నారు. శ్రీ రతన్ టాటా ట్రస్ట్ బోర్డులోనూ నోయల్ సభ్యుడిగా ఉన్నారు. కాగా ఇప్పటి వరకు టాటా ట్రస్టు ఛైర్మన్ గా రతన్ టాటా ఉన్నారు. ఆయన మరణంతో టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ పదవి ఖాళీ అయ్యింది. ఇప్పుడు ఈ బాధ్యతలను నోయల్ టాటాకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.



