పులివెందులలో ముగిసిన ఉప ఎన్నిక పోలింగ్..!

పల్లవి, వెబ్ డెస్క్ : ఏపీలోని పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఈరోజు మంగళవారం ఉప ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెల్సిందే. ఈరోజు ఉదయం ఏడు గంటలకు మొదలైన ఉపఎన్నికల పోలింగ్ సాయంత్రం ఐదు గంటలకు ముగిసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. సాయంత్రం ఐదు గంటలకు ఉప ఎన్నికల పోలింగ్ ముగిసిన అప్పటివరకు లైన్ లో ఉన్నవాళ్లకు ఓటు వేసే అవకాశం కల్పించింది.
పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ సాయంత్రం నాలుగు గంటలకు 74.57% శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపింది. మరోవైపు ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ లో డెబ్బై శాతం నమోదైనట్లు ప్రకటించింది. ఈ ఉప ఎన్నికలను అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఉప ఎన్నికలు కాబట్టి కూటమి పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
పులివెందుల అందులో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం , మూడు దశాబ్ధాలుగా అక్కడ టీడీపీ జెండా ఎగరలేదు కాబట్టి అంతేపట్టుదలతో వైసీపీ పోరాడుతుంది. గెలుపు మాది అంటూ ఇటు వైసీపీ, టీడీపీ చెబుతున్నాయి. చూడాలి మరి ఈసారి ఓటరన్నా ఎవరివైపు మొగ్గుచూపారో..?