విజయసాయిరెడ్డి ట్వీట్ వైరల్..!
పల్లవి, వెబ్ డెస్క్ : ఏపీలో సంచలనం సృష్టించిన లిక్కర్ కుంభకోణం కేసులో ఏ5 నిందితుడు , మాజీ ఎంపీ, వైసీపీ మాజీ సీనియర్ నేత విజయసాయిరెడ్డిని ఈరోజు శనివారం విజయవాడలోని సిట్ అధికారుల ముందు విచారణకు హజరు కావాలని నోటీసులు జారీ చేశారు.
అయితే తాను ముందుగా అనుకున్న కార్యక్రమాలు ఉన్నందున మరోక రోజు వస్తానని సిట్ అధికారులకు లేఖ రాశారు. ఈరోజు శనివారం ఉదయం మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా పెట్టిన ఓ పోస్టు వైరల్ అవుతుంది.
అందులో “विपक्ष सहित सभी राजनीतिक दलों को राज-धर्म का पालन करना चाहिए। కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన! మా కర్మఫలహేతుర్భూ: మా తేసంగోஉస్త్వకర్మణి!! కర్మలను ఆచరించుట యండే నీకు అధికారము కలదు కానీ వాని ఫలితముల మీద లేదు. నీవు కర్మఫలములకు కారణం కారాదు. అట్లని కర్మలను చేయుట మానరాదు. శ్రీ శ్రీ భగవద్గీత” అని చేసిన ట్వీట్ వైరలవుతుంది.



