‘అదుర్స్’ సినిమా చూపిస్తూ ఆపరేషన్ చేసిన్రు
‘అదుర్స్’ సినిమా చూపిస్తూ ఆపరేషన్
పల్లవి, వెబ్ డెస్క్: ఆపరేషన్ సమయంలో రోగి సేఫ్టీ కోసం డాక్టర్లు వివిధ రకాల పద్ధతులు అవలంబిస్తుంటారు. అయితే కాకినాడ సర్వజన ఆసుపత్రిలో ఓ మహిళ మెదడులో ఉన్న కణతిని తొలగించేటప్పుడు ఆమెకు ఓ సినిమా చూపించారు. ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది. మెదడులో సర్జరీ కాబట్టి.. ఆ సమయంలో నరాలు దెబ్బతినకుండా ఆమెకు ఇష్టమైన ఎన్టీఆర్ ‘అదుర్స్’ సినిమా చూపిస్తూ డాక్టర్లు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. కాగా వైద్య పరిభాషలో ‘అవేక్ క్రానియోటమీ’ అనే విధానంలో డాక్టర్లు ఆమె కణతిని తొలగించారు. ఈ ఆపరేషన్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మహిళా రోగికి " అదుర్స్ " సినిమా చూపించి ఆపరేషన్ చేసిన డాక్టర్లు. కాకినాడ సర్వజన ఆసుపత్రిలో ఘటన. ఓ మహిళ మెదడులో ఉన్న కణితిని తొలగించే సర్జరీ సమయంలో నరాలు దెబ్బతినకుండా ఆమెకు ఇష్టమైన ఎన్టీఆర్ అదుర్స్ సినిమా చూపించారు.#Kakinadasarvajanahospital#Adursmovie pic.twitter.com/H5HRSpBs7E
— Pallavi Media (@pallavimedia) September 18, 2024
Related News
-
జనసేన ఎంపీకి బిగ్ షాక్
-
మంచు ఫ్యామిలీలో మంటలు.. తన్నుకున్న తండ్రి కొడుకులు
-
అరె ఓ సాంబా ఏందిదీ : గబ్బర్‌సింగ్ రీరిలీజ్.. థియేటర్లు డ్యామేజ్!
-
ఆరుగురు పతివ్రతలు : పాపం నిశ్చితార్థం పేరుతో యువకుడిని మోసం
-
రేషన్ బియ్యం తరలింపులో నలుగురు ఐపీఎస్‌లు.. మంత్రి నాదెండ్ల కీలక వ్యాఖ్యలు
-
స్లోవేకియా ప్రధాని ఫికోపై కాల్పులు



