ఆరుగురు పతివ్రతలు : పాపం నిశ్చితార్థం పేరుతో యువకుడిని మోసం
పెళ్లి పేరుతో ఓ యువకుడిని ఆరుగురు మహిళలు మోసం చేశారు. రాజమండ్రికి చెందిన కృష్ణమోహన్ కు శిరిష అనే ఓ మహిళ పరిచయం అయింది. పెళ్లి చేస్తానని కృష్ణమోహన్ కు చెప్పి దాదాపుగా ఐదు లక్షలు కాజేసినట్టుగా చెబుతున్నాడు బాధితుడు. జూన్ 23న నీరజ అనే ఓ అమ్మాయిని తీసుకువచ్చి నిశ్చితార్థం కూడా చేసినట్టుగా చెబుతున్నాడు బాధితుడు. వధువు తల్లిగా సత్యదేవి, మేనత్తగా ప్రియాదేవిలను ఆమె పరిచయం చేసినట్లుగా చెబుతున్నాడు. నిశ్చితార్థం జరిగాక మూడు లక్షల క్యాష్, సెల్ ఫోన్, గోల్డ్ చైన్ తీసుకుని మోసం చేశారని బాధితుడు కృష్ణమోహన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వీరి గురించి ఆరా తీయగా నీరజకు అంతకుముందే పెళ్లై పాప కూడా ఉందని వెల్లడైంది. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన కృష్ణమోహన్ తాజాగా కాకినాడ కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశాడు. ఈ ఉదంతంలో ఆరుగురు మహిళలు ప్లాన్ ప్రకారం తనను మోసం చేశారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు.



