జగన్ ఇలాఖాలో టీడీపీ ఘనవిజయం..!

పల్లవి, వెబ్ డెస్క్ : ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల పరిధిలోని పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార టీడీపీ గెలుపొందింది. టీడీపీ తరపున బరిలోకి దిగిన ఆ పార్టీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు ఓట్లు సాధించారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం ఆరు వందల ఎనబై మూడు ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో మారెడ్డి లతారెడ్డి ఆరు వేల యాబై రెండు ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు.