డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై హైకోర్టులో పిటిషన్..!

పల్లవి, వెబ్ డెస్క్ : ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ లో ఉపముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ తాను హీరోగ నటించగా ఇటీవల విడుదలైన మూవీ హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ కోసం ప్రభుత్వ నిధులు, ప్రజాధనాన్ని వినియోగించారని అందులో పేర్కొన్నారు. దీనిపై తక్షణమే సీబీఐ విచారణ చేయించాలని విజయ్ కుమార్ కోరారు.
మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు కేసు విచారణ జాబితాలో సీబీఐ , ఏసీబీ న్యాయవాదుల పేర్లు చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. కాగా క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మించిన హరిహర వీరమల్లు ఇటీవల విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా విడుదలకు ముందు హీరోయిన్ నిధి అగర్వాల్, హీరో పవన్ కళ్యాణ్ ప్రచార బాధ్యతలను తమభుజాలపై వేసుకుని తెగ ప్రచారం చేసిన కానీ ఫలితం లేకుండా పోయింది. దాదాపు వంద కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
Related News
-
సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర కీలకం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
భారీ ధర పలికిన బాలాపూర్ లడ్డూ
-
మహిళల ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి- ఎంపీ కావ్య
-
సామాజిక కార్యక్రమాలకే ఎక్కువ సమయం కేటాయిస్తా -ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
-
వచ్చే సీజన్ కోసం కూలైన్లల్లో రైతులు -ఎంపీ రఘువీరారెడ్డి
-
శిల్పాశెట్టి దంపతులపై కేసు నమోదు