బనకచర్ల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదు – సీఎం చంద్రబాబు
పల్లవి, వెబ్ డెస్క్ : ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో రెండోరోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ‘ రాష్ట్రంలో రైతులను అన్ని విధాలా ఆదుకునే ప్రభుత్వం మాది.. ఈ ఏడాది ఎన్నడూ లేనంతగా దిగుబడి వచ్చింది.. ఏ పంట పండిస్తే లాభదాయకమో ఆలోచిస్తున్నాం.. ఫుడ్ ప్రాసెసింగ్, ఇంటర్నేషనల్ మార్కెటింగ్‌పై చర్చిస్తున్నాం.. మారిన ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంటల సాగు ఉండాలి.. ఆధునిక పద్దతులతో వ్యవసాయంలో లాభాలు పెరుగుతాయని’ అన్నారు.
చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ “ఏటా సగటున 2 వేల టీఎంసీల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నా నీటిని వాడుకునేందుకే బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తున్నాం. ఈ ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదు.. కొందరు కావాలనే తమ స్వార్ధ రాజకీయాలకోసం అనవసరంగా రాజకీయం చేస్తున్నారు.. వృథా అవుతున్న గోదావరి నీళ్లు వాడుకోవాలన్నదే మా ఉద్దేశం.. ఎగువ ఉన్న తెలంగాణ వాళ్లు ప్రాజెక్టులు కట్టుకుంటే నేను ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు.. ఇకపై కూడా అభ్యంతరం చెప్పను ” అని పునరుద్ఘాటించారు



