ఎన్డీఏకు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు : సీఎం చంద్రబాబు
పల్లవి, వెబ్ డెస్క్ : అభివృద్ధి, సంక్షేమం ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి రెండు కళ్లు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలోని సంపదను సృష్టిస్తాము.
సృష్టించిన ఆ సంపదను పేదలకు పంచుతాము. పేదల సంక్షేమానికి ఖర్చు చేస్తామని చెప్పాము. అందులో భాగంగానే ఈరోజు తల్లికి వందనం పథకం కింద సాయం అందజేస్తున్నాము.
ఇందుకు అమ్మ ఒడి నియమాలనే అమలు చేస్తున్నాము. అదనంగా ఎంతమంది పిల్లలుంటే అంత మందికి డబ్బులు ఇస్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వం కేవలం నలబై రెండు లక్షల మందికే ఇచ్చింది. కానీ మేము అరవై ఏడు లక్షల మందికి ఇస్తున్నామని ” ఆయన పేర్కొన్నారు.



